AP News: యువతిని రక్షించిన కానిస్టేబుల్‌‌ను అభినందించిన ఏపీ డీజీపీ.. ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకానికి సిఫార్సు..

ఆత్మహత్యయత్నంకు యత్నించిన యువతిని రక్షించిన కానిస్టేబుల్‌ను డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అభినందించారు. ఈనెల 17న యానం గోదావరి ఎదురులంక బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేసేందుకు ఓ యువతి ప్రయత్నించింది.

AP News: యువతిని రక్షించిన కానిస్టేబుల్‌‌ను అభినందించిన ఏపీ డీజీపీ.. ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకానికి సిఫార్సు..
Police Conistable

Updated on: Mar 21, 2023 | 6:00 AM

DGP Rajendranath Reddy: ఆత్మహత్యయత్నంకు యత్నించిన యువతిని రక్షించిన కానిస్టేబుల్‌ను డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అభినందించారు. ఈనెల 17న యానం గోదావరి ఎదురులంక బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నం చేసేందుకు ఓ యువతి ప్రయత్నించింది. ఆ యువతి నదిలోకి దూకడం గమనించిన అటుగా వెళ్తున్న ఎఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబు.. వెంటనే గోదావరిలోకి దూకి సదరు యువతిని రక్షించి తల్లితండ్రులకు అప్పగించాడు.

కానిస్టేబుల్ ధైర్య,సాహాసాన్ని ప్రసంసిస్తూ ఈరోజు డీజీపీ తన కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరబాబుకు నగదు బహుమతి అందజేశారు. ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకానికి వీరబాబు పేరు సిఫార్సు చేయాలంటూ సంబంధిత అధికారులకు డీజీపీ ఆదేశాలు పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..