Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..

|

Feb 04, 2022 | 2:50 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) ​తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (Gautam Sawang) భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో ఛలో విజయవాడ (Chalo Vijayawada) అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలిసింది

Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ.. ఆ విషయంపైనే ప్రధానంగా చర్చ..
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) ​తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ (Gautam Sawang) భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో ఛలో విజయవాడ (Chalo Vijayawada) అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలిసింది. నిర్భంధాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. అదేవిధంగా ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని పోలీసులు అంచనా వేసినా… అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్​టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా సీఎం చర్చించినట్లు తెలిసింది

అందుకే అడ్డుకోలేకపోయాం!
కాగా ఛలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను సీఎంకు డీజీపీ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరగడంతో ఉద్యోగుల నిరసనను అడ్డుకోలేకపోయామన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఇలాంటి విషయాలపై భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

Also Read:Pushpa: కలెక్షన్లలో తగ్గేదేలే అంటోన్న పుష్ప.. 50 రోజులకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే..

AP CM Jagan: న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేస్తోన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. నెట్టింట్లో వీడియో వైరల్

Liger Movie: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన లైగర్.. నెట్టింట్లో ఫొటోలు షేర్ చేసిన చార్మి..