AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. మూడో భర్తతో కలిసి కన్నతల్లినే..

అమ్మా నాన్నే అమ్మమ్మను చంపేశారు.. కళ్లముందే జరిగిన ఘోరాన్ని చూసి ఓ చిన్నారి చెప్పిన ఈ మాటలు విని పోలీసులే షాక్ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్ పేటలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లినే కాలయమురాలై కడతేర్చింది ఓ కసాయి కూతురు. బంగారం, కాసుల కక్కుర్తితో మూడో భర్తతో కలిసి అర్ధరాత్రి నిద్రపోతున్న తల్లి మెడకు చీర బిగించి ప్రాణాలు తీసింది.

Andhra Pradesh: దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. మూడో భర్తతో కలిసి కన్నతల్లినే..
Daughter Kills Mother In Guntur
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 9:04 PM

Share

గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డే కాలయమురాలైంది. తల్లి ఒంటిపై ఉన్న బంగారం, ఇంట్లోని నగదుపై కన్నేసిన ఓ కూతురు.. తన మూడో భర్తతో కలిసి అత్యంత పాశవికంగా తల్లిని హత్య చేసింది. ఈ కిరాతకానికి స్వయానా ఆమె కుమారుడే ప్రత్యక్ష సాక్షిగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన లక్ష్మీ అనే మహిళ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటు ఆమె కూతురు పుష్పలత మొదటి భర్త కుమారుడు కూడా కలిసి ఉంటున్నాడు. కాగా పుష్పలత తన మూడో భర్త రాజాను వెంటబెట్టుకుని రెండు నెలల కిందటే తల్లి లక్ష్మీ వద్దకు వచ్చింది. అప్పటి నుంచి తల్లితో ఎంతో సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూ వచ్చింది.

నగలు, డబ్బు కోసం వేధింపులు.. నిద్రలోనే దారుణ హత్య

లక్ష్మీ వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలపై పుష్పలత, రాజా కన్నుపడింది. వాటిని తమకు ఇచ్చేయాలంటూ గత కొన్ని రోజులుగా లక్ష్మిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆమె నిరాకరించడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేశారు. శుక్రవారం అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న లక్ష్మీ మెడకు చీర బిగించి అతి కిరాతకంగా ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో లక్ష్మీ మనవడు నిద్రలేచి కేకలు వేయబోయాడు. వెంటనే అతడిని బెదిరిస్తూనే.. నీకు కొత్త సైకిల్ కొనిస్తాం, ఎవరికీ చెప్పకు అంటూ మభ్యపెట్టారు. అనంతరం లక్ష్మి మెడలోని బంగారు గొలుసు, ఇంట్లో దాచిన నగదును మూటగట్టుకుని రాత్రికి రాత్రే అక్కడి నుంచి ఉడాయించారు.

కలకలం.. పోలీసుల రంగప్రవేశం

శనివారం తెల్లవారుజామున ఇంట్లో లక్ష్మీ విగతజీవిగా పడి ఉండటం, కుమార్తె, ఆమె భర్త కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పక్కనే భయంతో వణుకుతూ ఏడుస్తున్న మనవడిని ఆరా తీయగా.. “అమ్మ, నాన్నే అమ్మమ్మను చంపేశారు” అంటూ రాత్రి జరిగిన ఘోరాన్ని కన్నీళ్లతో వివరించాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య కేసులో మృతురాలి మనవడే కీలక ప్రత్యక్ష సాక్షి అని సీఐ కిషోర్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న పుష్పలత, ఆమె మూడో భర్త రాజా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Follow Us
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో
ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..
ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
ఏపీలో 3 లక్షల ఇళ్లకు శ్రీకారం..బుర్రిపాలెం వేదికగా మరో కీలక అడుగు
ఏపీలో 3 లక్షల ఇళ్లకు శ్రీకారం..బుర్రిపాలెం వేదికగా మరో కీలక అడుగు
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..