AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..

కోలీవుడ్‌లో రూ. 140 కోట్ల వసూళ్లతో అదరగొట్టిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సూరి కథానాయకుడిగా, టాలీవుడ్ హీరో సుహాస్ విలన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళనాడు సంప్రదాయ పడవ పందెం నేపథ్యంతో తెరకెక్కిన ఈ భారీ హిట్‌ను తెలుగుతో సహా ఐదు భాషల్లో వీక్షించవచ్చు.

OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..
Mandaadi
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2026 | 11:39 AM

Share

కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి ఏకంగా రూ. 140 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించిన స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మండాడి. టాలీవుడ్ హీరో సుహాన్, కోలీవుడ్ హీరో సూరి కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్లలో విపరీతమైన ఆదరణ పొందిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్లు తెలుస్తోంది.

ఈ యాక్షన్ డ్రామాను కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమెడియన్ నుంచి పవర్ ఫుల్ హీరోగా మారిన తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తమిళనాడు సాంప్రదాయ పడవ పందెం నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించి కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. సూరి, సుహాస్ పాత్రల మధ్య సాగే ఇంటెన్స్ మైండ్ గేమ్‌లు, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సుహాస్ తన విలనిజంతో థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీరితో పాటు మహిమా నంబియార్, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో మెరిసారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. సముద్రపు అలల మధ్య చిత్రీకరించిన విజువల్స్, జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన గూస్‌బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సముద్ర తీరప్రాంత పగ, ప్రతీకారం, క్రీడా నేపధ్యంతో కూడిన ఎమోషనల్ యాక్షన్ కథాంశంతో అలరించిన ‘మండాడి’ థియేటర్లలో మిస్ అయిన తెలుగు సినీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ విందు అందించడం ఖాయం.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

Follow Us