Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..!
India vs West Indies: 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌కు తొలి నాలుగు ఓవర్లలోనే 41 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో గర్నూర్ బ్రార్ వరుస ఫీల్డింగ్ తప్పిదాలు చేశాడు. కీలక క్యాచ్ నేలపాలు కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

India vs West Indies: భారత్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే మంచి ఊపు లభించింది. తొలి నాలుగు ఓవర్లలో 41 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. భారత బౌలర్లు పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు కూడా విండీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా గర్నూర్ బ్రార్ చేసిన రెండు తప్పిదాలు చర్చనీయాంశంగా మారాయి.
నాలుగో ఓవర్ రెండో బంతికి అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్‌కు తొలి వన్డే వికెట్ సాధించే అవకాశం వచ్చింది. జాన్ క్యాంప్‌బెల్ ఆడిన షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి ఎగిరింది. డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గర్నూర్ బ్రార్ బంతి కిందకు చేరుకున్నాడు. క్యాచ్ తీసుకునే స్థితిలో ఉన్నప్పటికీ, బంతి చివరి క్షణంలో కిందకు రావడంతో అతడు అవకాశాన్ని చేజార్చాడు.
ఈ తప్పిదంపై బ్రార్ కూడా అసంతృప్తికి గురయ్యాడు. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) రియాక్షన్ కెమెరాలో కనిపించింది. క్యాచ్ నేలపాలు కావడంతో అతడు కళ్లను తిప్పుతూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఆ ఓవర్‌లో కథ అక్కడితో ముగియలేదు. మూడో బంతికి శాయ్ హోప్ (Shai Hope) బ్యాట్‌కు తగిలిన ఎడ్జ్ నేరుగా గర్నూర్ బ్రార్ వైపే వెళ్లింది. ఈసారి కూడా బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో అది అతడి చేతుల మధ్యగా జారిపోయింది. ఫలితంగా ఒక పరుగుగా మారాల్సిన అవకాశం బౌండరీగా మారింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా ఈ ఫీల్డింగ్ తప్పిదంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?
ఒకే ఓవర్‌లో రెండు అవకాశాలు చేజారడంతో భారత శిబిరంలో నిరాశ పెరిగింది. ఆ తర్వాత తొలి వికెట్ కోసం భారత్ ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతమైన బంతితో జాన్ క్యాంప్‌బెల్ వికెట్లను పడగొట్టాడు. ఆ వికెట్ కోసం ఫీల్డర్ సహాయం అవసరం లేకపోయింది.
గుర్నూర్ బ్రార్ ఫీల్టిండ్ మిస్టేక్ వీడియో..
https://t.co/EbnGRlL3yo
— crictalk (@crictalk7) October 3, 2026
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




