Janasena Pawan Kalyan: వాలంటిర్లు.. వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లు సోదర సమానులు అంటూ పేర్కొన్నారు. ‘‘వాలంటీర్లు నాకు సోదర సమానులు.. వారి పొట్ట కొట్టాలనేది నా ఉద్దేశం కాదు.. వాలంటీర్లు అందరూ చెడ్డ వాళ్లు అని చెప్పడం లేదు.. వాలంటీర్ వ్యవస్థ ఎలా పని చేయాలనే దాని గురించే మాట్లాడుతున్నా’’.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జీతం ఆశించకుండా పనిచేసే వాళ్లు వాలంటీర్లు.. డబ్బులు తీసుకునే వాళ్లు వాలంటీర్లు ఎలా అవుతారు? అంటూ ప్రశ్నించారు. ఒక రోజు వాలంటీర్ జీతం రూ. 164.. చదువుకున్న యువకులు పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలి అంటూ పవన్ పేర్కొన్నారు. వారాహి యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలు కోరుకున్న చోట మద్యం నిషేధిస్తా.. ఆడపిల్లల మాన, ప్రాణ రక్షణ జనసేన లక్ష్యం అంటూ పేర్కొన్నారు.
నేను కార్మికుల, మహిల భద్రత, ఉపాధి గురించి మాట్లాడుతున్నా.. ఎప్పుడూ ప్రజా సమస్యల గురించే మాట్లాడుతున్నా.. నేను వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదంటూ పవన్ పేర్కొన్నారు. నేను సీఎం జగన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.. మేం ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా, మా వీరమహిళల గురించి దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రిగా అర్హత లేదు.. జగన్.. పెళ్లాం, పెళ్లాం అని మాట్లాడుతావేంటి? సీఎం జగన్ దిగజారిపోయి మాట్లాడుతున్నారు.. అంటూ ఫైర్ అయ్యారు.
జగన్ తండ్రి మాదిరి మా నాన్న సీఎం కాదు.. ఏపీకి సంబంధించిన డేటా హైదరాబాద్ నానక్‌రూంగూడలో ఉందంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏపీ డేటా హైదరాబాద్‌లో ఎందుకు ఉంది? సీఎం సమాధానం చెప్పాలన్నారు. తాను సమస్యలపై మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా దూషించారన్నారు. ముస్లింలకు తానంటే వ్యక్తిగతంగా ఇష్టమని పవన్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..