AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 21వేలకు పైగా..

| Edited By: Team Veegam

May 12, 2021 | 11:11 PM

AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ..

AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. కొత్తగా 21వేలకు పైగా..
Corona Virus
Follow us on

AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వీరిలో 21,452 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారించారు. ఇక ఒక్క రోజులో 19,095 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,44,386 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. వీరిలో 11,38,028 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,97,370 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,988 మంది ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 2,185 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1,908, తూర్పుగోదావరి – 2,927, గుంటూరు – 1,836, కడప – 1,746, కృష్ణా – 997, కర్నూలు – 1,524, నెల్లూరు – 1,689, ప్రకాశం – 1,192, శ్రీకాకుళం – 1,285, విశాఖఫట్నం – 2,238, విజయనగరం – 693, పశ్చిమ గోదావరి – 1,232 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

ఐదు రోజులు కంప్యూటర్లతో కూస్తీ.. మరో రెండు రోజులు కోళ్ల పెంపకంపై ఫోకస్.. స్టైల్ మార్చిన సాఫ్ట్ వేర్ ఫ్రెండ్స్

Actors Prabhas: ప్రభాస్ సినిమాలో మెగాస్టార్… ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఇంట్రస్టింగ్ గాసిప్…

Lock Down in Telangana: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కేవలం ఐదు గంటల్లోనే రూ. 20 కోట్ల అమ్మకాలు.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..