విజ్ఞాలకు అధిపతి అయిన గణనాథుని ఆలయంలో ఇప్పుడు మరో వివాదం తెరమీదికి వచ్చింది. కాణిపాకం దేవస్థానంలో ఉభయ దారులు వర్సెస్ ఆలయ యంత్రాంగం మద్య వార్ నడుస్తోంది. ఆలయ ఈఓ, పాలకమండలి చైర్మన్ తీరుపై మండిపడుతున్న ఉభయదారులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితికి కారణం అయ్యింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్ట దిగజార్చేలా ఉభయదారుల తీరు ఉందంటున్న చైర్మన్, ఈఓ కౌంటర్ ఎటాక్ తో కాణిపాకం టెంపుల్ వ్యవహారం కాంట్రవర్సీగా మారింది.
స్వయంభు శ్రీ వరసిద్ది వినాయకుడు వెలసిన క్షేత్రం ఇప్పుడు కాంట్రవర్సీ కి కేరాఫ్ గా మారుతోంది. ఈ మధ్య కాలంలో పలు వివాదాలతో తెరమీదికి వచ్చిన దేవస్థానం ఇప్పుడు ఆలయ ఈఓ చైర్మన్ తీరు ఉభయ దారులను రోడ్డెక్కేలా చేసింది. గత కొద్దికాలంగా ఆలయ ఈఓ వెంకటేష్ వ్యవహరంపై గుర్రుగా ఉన్నారు ఉభయదారులు. 4 రోజుల క్రితం సీఎం జగన్ చేతుల మీదుగా కాణిపాకం ఆలయచరిత్ర, వైభవం గ్రంధాన్ని ఆవిష్కరించిన కాణిపాకం ఆలయ చైర్మన్, ఈవో ఉభయ దారులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాన్ని తెరమీదికి తెచ్చారు. సీఎం ఆవిష్కరించిన కాణిపాకం ఆలయ చరిత్ర వైభవం పుస్తకంలో ఉభయదారుల ప్రస్థావన లేదని ఆరోపిస్తున్నారు ఉభయదారులు. పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రాధాన్యత లేక పోవడం, కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
వెయ్యేళ్ల నాటి ఆలయ అభివృద్ధి, పరిరక్షణకు ఎంతో కృషి చేసిన ఉభయదారులదే కీలకపాత్రని చెబుతున్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని సమయంలో కాణిపాకంకు చుట్టూ పక్కల ఉన్న 14 గ్రామాల ప్రజలు స్వయంభు వరసిద్ధి వినాయకుడి ఆలయ జీర్ణోద్ధరణకు అండగా ఉన్నామని ఉభయదారులు భావిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ కు సహకరించి వందలాది ఎకరాలను ఇచ్చి సహకరించింది ఉభయ దారులేనని, అయితే గత కొంతకాలంగా ఉభయ దారుల ప్రాధాన్యత తగ్గుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆలయ ఈవోగా వెంకటేష్, పాలకమండలి చైర్మన్ గా మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉభయ దారులకు కనీస గౌరవం కూడా తగ్గడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు ఈ మద్య కాలంలో కాణిపాకం ఆలయ పాలనలో అనేక వివాదాలు తెరమీదికి రావడాన్ని కూడా ఉభయదారులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ అభివృద్ధి తీసుకుంటున్న నిర్ణయాలపై ఉభయ దారులకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకపోవడం కూడా వివాదానికి కారణం అయ్యింది. ఈ మధ్య కాలంలో దాతలు ఇచ్చిన కానుకలు మాయం కావడం, అర్చకులు అధికారుల ఇష్టారాజ్యంపై ఆరోపణలు రావడం తో చెలరేగిన దుమారాన్ని ఎత్తి చూపుతున్న ఉభయ దారులు ఆలయంలో సేవల టికెట్ల పెంపులో పాలకమండలి ఏకపక్ష నిర్ణయాలను తప్పుపడుతున్నారు.
దీంతో ఆలయ పాలన తీరును ప్రశ్నిస్తూ రెండ్రోజుల క్రితం ఈఓ కార్యాలయం ముందు ఉభయదారుల నిరసనకు దిగారు. కాణిపాకం మాలయ చరిత్ర వైభవం పుస్తకంలో ఉభయదారులకు చోటు కల్పించకపోవడాన్నే తీవ్రంగా పరిగణిస్తున్న వేదాలను ఈ మేరకు సమావేశమై ఆలయ యంత్రాంగంపై పోరాటానికి సిద్ధం అయ్యారు. ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి తీరుపై ఉభయదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాణిపాకం ఆలయ పరిపాలన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈఓ వెంకటేష్ ను సస్పెండ్ చేయడంతో పాటు పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ ను ఉభయదారులు తెర మీదికి తెచ్చారు. ఉభయ దారుల్లో ఒకరైన కాణిపాకం సర్పంచ్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇక ఉభయదారుల ఆరోపణలు, వ్యవహారం దేవస్థానం ప్రతిష్ట దిగజార్చేలా ఉందని ఆలయ యంత్రాంగం ఎదురు దాడి చేస్తోంది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉభయ దారులు వ్యవహరిస్తున్నారని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేష్ ఆరోపిస్తున్నారు. సమస్యలుంటే చెప్పుకోవాలే తప్ప ఆలయ పాలనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఈఓ వార్నింగ్ ఇస్తున్నారు. చూడాలి మీర ఈ గొడవ ఎంతవరకు దారి తీస్తుందో..!!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…