మంగళగిరి, అక్టోబర్ 30: చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన కానిస్టేబుల్ లక్షల విలువ చేసే అస్థి కోసం కట్టుకున్న భార్యనే చనిపోయిందటు నకిలీ డెత్త్ సర్టిఫికేట్, నకిలీ ఫ్యామీ నెంబర్ సర్టిఫికేట్‌తో భార్య పేరు పై ఉన్న స్థలాన్ని ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ గా పని చేస్తూన్న శివశకర్‌కు మాధవి అనే మహిళతో 16 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారుల సంతానం కలరు. గత కొన్నేళ్ళగా భార్య భర్తలు శివశంకర్, మాధవి మద్య విభేధాలు తలెత్తాయి.
ఇవి పెద్దవిగా మారడంతో భార్య మాధవి ఇద్దరు కుమారులతో కలిసి అమె తల్లిదండ్రులు తో కలిసి గుంటూరులో జీవనం సాగిస్తూంది. భార్య, భర్తలు ఇద్దరు కలిసి ఉన్న సమయంలో భార్య మాధవి పై నంద్యాల జిల్లా రైతునగర్‌లో నాలుగు సెంట్ల స్థలం ఉంది. అ స్థలం విలువ ప్రస్తుతం లక్షల్లో పలకడంతో తనకు దూరంగా ఉన్న భార్యకు దక్కకూడదనే భావతంతో నకిలీ సర్టిఫికేట్‌ల కోసం గిద్దలూరులోని కొందరు మధ్యవర్తులను శివశంకర్ సంప్రదించాడు.
గిద్దలూరులో నివాసమే లేని మాధవికి అడిగన వెంటనే గిద్దలూరు నగర పంచాయతి అధికారులు ఎలాంటి విచారణ లేకుండా 2019లో మరణించదని మాధవి డెత్త్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఈ రెండు సర్టిఫికేట్ ల అధారంగా కానిస్టేబుల్ శివశంకర్ అ ఆస్తికి తానే వారసుడని ఇతరులకు అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య మాధవి న్యాయం కోసం నంద్యాల తాలుకా అర్బన్ పోలీసులను సంప్రదించింది. మాధవి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శివశంకర్ పరారీలో ఉన్నాడు. చట్టం పరిధిలో పని చేస్తూ చట్టాలకు అతీతంగా పని చెయ్యాల్సిన ఓ కానిస్టేబుల్ ఇలా ఆస్తి కోసం అడ్డదారిలో కట్టుకున్న భార్యనే చనిపోయిందని సర్టిఫికెట్లను సృష్టించడం పై జిల్లా పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.