AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: “అప్పట్లోగా రోడ్లు రెడీ చేయండి”.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్

ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం

AP CM YS Jagan: అప్పట్లోగా రోడ్లు రెడీ చేయండి''.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్
Venkata Narayana
|

Updated on: Sep 06, 2021 | 3:38 PM

Share

AP CM YS Jagan Roads Review: ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగుచేయాలని ఆయన ఆదేశించారు. “అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది.” అని సీఎం అన్నారు. “మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది” అని సీఎం అమరావతిలో నిర్వహించిన రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల సమీక్షా సమావేశంలో చెప్పారు.

రోడ్లు, రహదారుల నిర్వహణకు సంబంధించి వనరుల సమీకరణలో ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని సీఎం చెప్పారు. దీనికి ఒక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. “దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాదు. పచ్చమీడియాతో మనం యుద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు లేకపోవడంతో వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాకూడా, నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దాం. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే.. నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయి. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి.” అని సీఎం అన్నారు.

గ్రామీణ, పట్టణ రోడ్లు, రహదారులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి.. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి అని సీఎం అధికారులకు సూచించారు. నివేదికలు ఆధారంగా ఫోకస్‌ పెట్టి వాటిని బాగుచేయండన్నారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణ చేయాలని సీఎం ఆదేశించారు.

Read also: Crime News: హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ.. దర్యాప్తులో నిజాలు తెలిసి షాక్‌కు గురైన పోలీసులు