AP CM YS Jagan: చెడిపోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నాం.. ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

AP CM YS Jagan: చెడిపోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నాం.. ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
Ap Cm Ys Jagan

AP YSR Pension Kanuka Scheme: చెడి పోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నామని, రాజకీయ స్వార్థంతో ప్రతి విషయంలో అడ్డుతగులుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు.

Balaraju Goud

|

Jan 01, 2022 | 12:51 PM


YSR Pension Kanuka Scheme: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడ్డా, సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని సీఎం అన్నారు. వైఎస్ఆర్ ఫించన్ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛన్ పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు.

ఏ సమాజం అయినా చీకటి నుంచి వెలుగులోకి రావాలని, అభివృద్ది చెందాలని కోరుకుటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఏ కుటుంబం అయినా నిన్నటికంటే భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారని, ప్రజల బాగోగులు చూసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారని ఆయన అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వృద్దాప్య పెన్షన్‌ను 2,500 రూపాయలకు పెంచుతూ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంబించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతిఒక్క హామీని తాము నెరవేర్చే్ందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానని సీఎం అన్నారు. మంచి చేస్తుంటే విమర్శించేవారు కూడా ఉంటారని ఆయన అన్నారు.అలాంటి విమర్శలకు ప్రజలే సమాదానం చెప్పాలని ఆయన సూచించారు.

చెడి పోయిన రాజకీయాల మధ్య పాలన చేస్తున్నామని, రాజకీయ స్వార్థంతో ప్రతి విషయంలో అడ్డుతగులుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ ఏడాదిలోనైనా పేదలకు చేస్తున్న మంచికి అడ్డుతగలవద్దన్న జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మంచి చేయలేని పార్టీలు,నాయకులు విమర్శిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నారన్న సీఎం.. పేదలకు ఆస్తిని పంచి పెడుతుంటే కోర్టులకి వెళ్లి స్టేలు తీసుకొచ్చారన్నారు. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని అంటే కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఓటిఎస్ ను ఇస్తామంటే జీర్ణించుకోలేక పోతున్న ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. అందుబాటు రేటుకు వినోదం అందివ్వాలని నిర్ణయం చేస్తే వ్యతిరేకిస్తున్నారు.

వృద్దాప్య ఫించన్ పథకం ద్వారా రాష్ట్రంలో 62 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు. దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న మొత్తం, ఎక్కువ సంఖ్యలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మనదేనని జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వం 39 లక్షల మందికే పెన్షన్‌ ఇచ్చిందన్నారు. న్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల మాత్రమే ఫింఛన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా ఉండాలని ఫించన్ రూపంలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫింఛన్లకు కోటాలు, కోతలు లేవని స్పష్టం చేసిన సీఎం.. లంచాలకు, వివక్షకు, బ్రోకర్లకు, దళారులకు చోటు లేకుండా ఫింఛన్లు ఇస్తున్నామన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu