CM Jagan: 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

|

Sep 03, 2021 | 12:38 PM

రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని

CM Jagan:  10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
CM YS Jagan
Follow us on

CM Jagan – AP Industries: రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ తరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. తద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్న సీఎం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలని సీఎం అన్నారు. గతంలో హడావుడి ఎక్కువగా.. పని తక్కువగా ఉండేదని చంద్రబాబు సర్కారుపై సీఎం జగన్ విమర్శలు చేశారు.

కొప్పర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ను స్థాపిస్తున్నామని సీంఎం జగన్ తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని జగన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోందని జగన్ తెలిపారు.

ఇలాఉండగా, గత ఏడాది మే 22న తొలిసారిగా రీస్టార్ట్‌ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.

Read also:  Vijayasai Reddy: దేవుని ఆస్తులు కొల్లగొట్టడంలో ఆయన పాత్రపై అనుమానాలు.. అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు