ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు శుక్రవారం నాడు నిధులు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాలో వేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా 19.95 కోట్లను విడుదల చేయనున్నారు సీఎం జగన్.
వరల్డ్ యూనివర్శిటీ క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 యూనివర్శిటీలను ఎంపిక చేసింది ప్రభుత్వం. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి గరిష్టంగా కోటి రూపాయల వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తోంది జగన్ సర్కార్. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..