సీఎం జగన్ రెండో రోజు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. నిన్న ప్రధానితో సమావేశం అయిన సీఎం జగన్ ఇవాళ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలో నవోదయా పాఠశాలల ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్ లో నిధులు, నూతన విద్యావిధానం అమలు పై కేంద్రమంత్రితో చర్చించారు ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్‌మెంట్ కింద కేంద్ర ఏర్పాటు చేసే ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాడు-నేడు, విద్యాభివృద్ధికి చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కేంద్రమంత్రికి వివరించారు.
అంతకుముందు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించారు. గంటసేపు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. కోస్తా తీర ప్రాంతంలో 4లైన్ల రోడ్డును నిర్మించాలని, విశాఖ-భోగాపురం మధ్య జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు ముఖ్యమంత్రి. విజయవాడ తూర్పు హైవే నిర్మాణంపైచర్చించారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇవ్వాలని కోరారు సీఎం జగన్.
ఆ తర్వాత కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తోనూ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు.
ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..
Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..