కేంద్ర సహకారంతోనే ఏపీ అభివృద్ధి చెందుతోంది- పురంధేశ్వరి
తిరుపతి నుంచి జిల్లాల పర్యటన మొదలుపెట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుపతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వివరించారు. కేంద్రం సహకారంతోనే ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు.

పార్టీ బలోపేతంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫోకస్ పెట్టారు. బీజేపీ చేపట్టిన 26 జిల్లాల పర్యటనలో భాగంగా పురంధేశ్వరి తిరుపతిలో పర్యటించారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపాలను పరిశీలించారు. పునరుద్ధరణ పేరుతో మండపాల తొలగింపును బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా మండపాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పురాతన పార్వేట మండపాన్ని తొలగించి ఇష్టానుసారంగా నిర్మించారన్నారు. శ్రీవారి కానుకలను సనాతన ధర్మ పరిరక్షణకే కేటాయించాలన్నారు.
TTD నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వడం సరికాదన్నారు పురంధేశ్వరి. మరోవైపు తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. కేంద్ర సహకారంతోనే ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని.. కేంద్ర సహకారం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు.. కేంద్రం రూ.1,695 కోట్లు కేటాయించిందన్నారు.
I am grateful to have visited the Tirupati Devasthanam Goshala and had the opportunity to take darshan and feed the sacred Gau Mata 🙏#DivineExperience #Blessed pic.twitter.com/E81DR6Jphe
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) November 1, 2023
Visited Tirupati and inspected the development programs at the railway station. pic.twitter.com/feC0Xtr1XU
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) November 1, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..