AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram charan RC 16: ఏమున్నాడ్రా బాబు..! బాక్సాఫీస్ బద్దలే..!! ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు(మార్చి 27) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మెగా అభిమానులు రెడీ అయ్యారు. మెగాభిమానులంటేనే సేవకు మారుపేరు. ఈ క్రమంలోనే చెర్రీ పుట్టిన రోజున పలు సేవా కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రచించారు

Ram charan RC 16: ఏమున్నాడ్రా బాబు..! బాక్సాఫీస్ బద్దలే..!! ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Rc 16
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2025 | 9:20 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్సీ 16( వర్కింగ్ టైటిల్) కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చివరిగా చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు చరణ్ ఆర్సీ 16 పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అంటే మార్చి 27 న( ఈ రోజు) విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చరణ్ తన స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించాడు, ఇది అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఫస్ట్ లుక్‌లో రామ్ చరణ్ గడ్డంతో కూడిన రగ్గడ్ లుక్‌లో, గ్రామీణ నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ లుక్‌ను ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రూపొందించారు. అలాగే ఈ  సినిమా కథకు సంబంధించిన రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌ను సూచిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా, ఉత్తరాంధ్ర పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అలాగే చరణ్ లు సినిమా ఇంటెన్సిటీని మరింత హైలైట్ చేస్తుంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్