AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ (Governor Biswabhusan) ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాజధాని అమరావతి(Amaravathi) పై వెలువరించిన హైకోర్టు తీర్పు గురించి సభలో చర్చించాలని సీఎంకు ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్పుపై చర్చ జరపాలని ఆ లేఖలో కోరారు. అయితే ఏపీకి మూడు రాజధానులు మా విధానం మని అధికార పార్టీ వైసీపీ అంటుంటే.. అమరావతి రాజధాని అని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజూ నిర్వహించాలని విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మినహా మిగిలిన సభ్యులంతా హాజరుకానున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యలపై పోరాడతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. అమరావతి, పోలవరం, వివేకానందరెడ్డి హత్యకేసు వంటి అంశాల్ని అసెంబ్లీలో చర్చించనున్నామని తెలిపారు. అయితే ఈ సమావేశాల్లో
Also Read: