AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆటగదరా శివ.. దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి..

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దోశ తింటుండగా గొంతులో ఇరుక్కొని రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన బాలుడు తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల కుమారుడు కుశాల్‌గా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: ఆటగదరా శివ.. దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి..
Dosha
Anand T
|

Updated on: Jul 19, 2025 | 11:48 AM

Share

దోశ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ రెండేళ్ల బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్ల ముందే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పట్టణంలోని తపోవనంలో అభిషేక్, అంజినమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కుశార్ అనే రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇద్దరు దంపతులు కొడుకుతో పాటు టిఫన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దోశ ముక్క ఒక్కసారిగా బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడికి ఊపిరాకడ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

కుమారుడు పడిపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటీన బాలుడిని తీసుకొని స్థానిక హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. కాసేపటికే ఆ బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. కంటిరెప్పలా కాపాడుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారు తమ కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్లాన్‌
గ్లోబల్‌ ఫిల్మ్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్లాన్‌
అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు మూవీపై జాన్వీ ప్రశంసలు
అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు మూవీపై జాన్వీ ప్రశంసలు
ఉదయం లేదా సాయంత్రం.. గ్రీన్‌టీ ఏటైంలో తాగడం ఉత్తమం
ఉదయం లేదా సాయంత్రం.. గ్రీన్‌టీ ఏటైంలో తాగడం ఉత్తమం
ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. ఆ బస్సుల్లో కూడా ఫ్రీ..
ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. ఆ బస్సుల్లో కూడా ఫ్రీ..
మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. అల్లు అరవింద్..
మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. అల్లు అరవింద్..
సమ్మిట్‌లో రెండోరోజు కీలక అంశాలపై లోతైన డిస్కషన్‌
సమ్మిట్‌లో రెండోరోజు కీలక అంశాలపై లోతైన డిస్కషన్‌
డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ ఊరట.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ ఊరట.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
వరుసగా 18 మ్యాచ్‌ల్లో టీమిండియాకు భారంగా సూర్య..
వరుసగా 18 మ్యాచ్‌ల్లో టీమిండియాకు భారంగా సూర్య..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజుల్లో తీసుకోకపోతే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజుల్లో తీసుకోకపోతే
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! సూపర్‌ స్మార్ట్‌ ఫోన్‌