AP SSC Supply Exams 2023: జూన్‌ 2 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి..

|

May 31, 2023 | 10:26 AM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,12,221 మంది విద్యార్థులు సప్లి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు 915 పరీక్ష కేంద్రాలను..

AP SSC Supply Exams 2023: జూన్‌ 2 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి..
AP Tenth Supplementary Exams
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,12,221 మంది విద్యార్థులు సప్లి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు 915 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లోఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని, ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల (ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌)ను నియమించినట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమన్నారు. పరీక్షల అనంతరం జూన్‌ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించి సందేహాలకు 0866–2974540 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చన్నారు. ఇది జూన్‌ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల 2023 షెడ్యూల్‌ ఇదే..

  • జూన్‌ 2 ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌, కాంపొజిట్‌ కోర్సు పేపర్ 1
  • జూన్‌ 3 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • జూన్‌ 5 ఇంగ్లిష్
  • జూన్‌ 6 మ్యాథమెటిక్స్‌
  • జూన్‌ 7 సైన్స్
  • జూన్‌ 8 సాంఘిక శాస్త్రం
  • జూన్‌ 9 కాంపొజిట్‌ కోర్సు పేపర్ 2, సంస్కృతం, అరబిక్‌, పార్శి పేపర్‌ 1
  • జూన్ 10 సంస్కృతం, అరబిక్‌, పార్శి పేపర్‌ 2

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.