
నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజి వద్ద పెను ప్రమాదం తప్పింది.. నెల్లూరు జిల్లాలో గడిచిన 15 రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలతో పాటుపై కురిసిన వర్షాలకు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే తాజాగా మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కండలేరు, సోమశిల జలాశయాలు నిండుకుండలా మారి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. దీంతో అధికారులు కండలేరు నుంచి తెలుగు గంగకి నీటిని విడుదల చేయగా సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేసారు. అయితే సోమశిల నుంచి విడుదల చేసిన నీరు సంఘం బ్యారేజి వద్దకు చేరుకున్న తరువాత అధికారులు ఎప్పటికి అప్పుడు పరిస్థితికి తగ్గట్లు సంఘం బ్యారేజి గేట్లు ఎత్తి పెన్నాకి నీటిని విడుదల చేయడం జరిగింది.
అయితే సోమశిల నుంచి సంగం బ్యారేజీకి నీరు వచ్చిన సమయంలో అప్పటికే పెన్నా నుంచి ఇసుక తరలించేందుకు ఉపయోగించే మూడు బోట్లు తుఫాన్ గాలుల ధాటికి తాళ్ళు తెగి నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. నెట్టి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బొట్లు సంఘం బ్యారేజి వద్దకు చేరుకుని గేట్లను ఢీకొడితే పెను ప్రమాదమే జరిగేది. ఓ వైపు పెన్నాలో సోమశిల నీటి ప్రవాహం. మరోవైపు తుఫాన్ గాలుల ధాటికి వేగంగా వస్తున్న బోట్లు కలిసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కళ్ళ ముందు బోట్లు కొట్టుకుని వస్తున్న ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
అయితే వేగంగా నీటి ప్రవాహంలో కొట్టుకుని వస్తున్న బోట్లు గాలుల ధాటికి సంఘం బ్యారేజి గేట్ల వద్దకు చేరుకునే సమయంలో దిశ మార్చు కోవడం తో సంఘం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇలాంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజి వద్ద గేట్లకు బోట్లు అడ్డుకోవడం అప్పట్లో పెద్ద రాజకీయ దుమారమే రేపింది. అయితే నెల్లూరు జిల్లా సంఘం బ్యారేజి వద్ద ఎలాంటి రాజకీయ కోణం లేనప్పటికీ ఆ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తు చేసుకున్నారు. గాలికి ఆ బోట్లు దిశ మార్చుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.