Pawan Kalyan: ‘నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటా..’ పవన్ సంచలన కామెంట్స్

హోంమంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పారు. ఏపీలో జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలన్నారు.

Pawan Kalyan: నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటా.. పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan

Updated on: Nov 04, 2024 | 3:31 PM

డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండదు. రేప్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా? అధికారులు ఏం చేస్తున్నారు.. క్రిమినల్స్‌ను వదిలేయమని చట్టం చెప్తోందా అని ప్రశ్నించారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దని పవన్ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కీలకమైనది. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. మేము ఎవరినీ వెనకేసుకు రావడం లేదు.. మీరు కూడా వెనకేసుకు రావద్దన్నారు పవన్.

హోం మంత్రి అనిత కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. తాను హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వాడిని నేను. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు.. అలాగని చేతగాని ప్రభుత్వం కాదు. అధికారులు అలసత్వం వహిస్తే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కూటమి పార్టీల్లోని నేతల తీరుపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కూటమిని ఎవరు చెడగొట్టలేరని, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే తమను ఏమీ చేయలేరన్నారు. తాను, చంద్రబాబు క్లారిటీతో ఉన్నామన్న పవన్ కళ్యాణ్.. ఈ పొత్తు స్థిరమైందని.. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమ పొత్తును దెబ్బతీయలేవన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..