Andhra Pradesh: ఏపీ నుంచి ఐపీఎల్‌కు టీమ్‌ను పంపడమే లక్ష్యంగా.. APL సీజన్‌ 2

| Edited By: Narender Vaitla

Aug 01, 2023 | 1:52 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - ఐపీఎల్‌లో ఆంధ్రా జట్టు లేదు. వచ్చే సీజన్‌కు ఆంధ్రా నుంచి కూడా ఐపిఎల్‌కుఒక టీమ్‌ను పంపే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ బదులు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభను గుర్తించడం, ఉన్న ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు క్రీడాకారులకు నైపుణ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. సీజన్ 2 పై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ...

Andhra Pradesh: ఏపీ నుంచి ఐపీఎల్‌కు టీమ్‌ను పంపడమే లక్ష్యంగా.. APL సీజన్‌ 2
APL
Follow us on

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 1 విజయవంతం అయిందని ప్రకటించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సీజన్ – 2 షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 16 న ప్రారంభమై 27 న ఈ సీజన్ ముగుస్తుంది. మొదటి సీజన్‌లోని టీమ్స్ తో పాటు, ఈ సీజన్ కు ACA మరో ఫ్రాంచైజీని కూడా జోడించాలని నిర్ణయించుకుంది, దీంతో మొత్తం టీమ్‌ల సంఖ్య ఏడుకి చేరనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. సోమవారం మధురవాడ స్టేడియం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ సెక్రటరీ వీ గోపీనాథ్‌రెడ్డి సీజన్ 2 షెడ్యూల్ తో పాటు అన్ని వివరాలను వెల్లడించారు.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణ లక్ష్యం ఇదే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ – ఐపీఎల్‌లో ఆంధ్రా జట్టు లేదు. వచ్చే సీజన్‌కు ఆంధ్రా నుంచి కూడా ఐపిఎల్‌కుఒక టీమ్‌ను పంపే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ బదులు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభను గుర్తించడం, ఉన్న ఆటగాళ్లలో నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు క్రీడాకారులకు నైపుణ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. సీజన్ 2 పై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గత సీజన్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందనీ,. మరిన్ని జట్లను చేర్చుకోవడానికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు గ్రిప్‌గా ఉండేలా చూసేందుకు, కొత్త పాలక మండలి మరో జట్టును మాత్రమే చేర్చుకోవాలని నిర్ణయించిందని తెలిపారు.

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వల్ల క్రీడాకారులకు పలు అవకాశాలు..

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ లో అద్భుత ప్రతిభ చూపి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందిన నితీష్ కుమార్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్, గుజరాత్ టైటాన్స్ తరఫున కెఎస్ భరత్ వంటి పలువురు ఆటగాళ్లు ఎపిఎల్ ద్వారా లబ్ధి పొందారని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇది కాకుండా, చాలా మంది సహాయక సిబ్బందికి జాతీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే అవకాశం లభించిందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. టోర్నమెంట్ యొక్క లీగ్ దశలో 21 మ్యాచ్‌లు జరుగుతాయని, ఒక్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుందని ACA ప్రకటించింది. మొదటి నాలుగు జట్లు క్వాలిఫైయర్లు మరియు ఎలిమినేషన్లకు అర్హత సాధిస్తాయనీ, రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయనీ ప్రకటించింది ఏసీఏ. మొదటి సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయనీ, ఈసారి విశాఖపట్నంతో సహా మరో రెండు గ్రౌండ్స్ పై ఈ మ్యాచ్‌లు నిర్వహించాలని చూస్తున్నాం.

ఇవి కూడా చదవండి

నేడే ఫ్రాంచైజీల వేలం..

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్- 2 ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు 10,000 రూపాయల అప్లికేషన్ ఫీజ్‌తో పాటు 2 లక్షల రూపాయల రీ ఫండబుల్ డిపాజిట్ కల EMD చెల్లించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో ఫ్రాంచైజీ బేస్ ధర రూ. 70 లక్షల నుంచి రూ. 1.35 కోట్లకు పెంచామని, వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో దరఖాస్తు ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విజయవంతమైన బిడ్డర్‌ లను ప్రకటిస్తామని తెలిపింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్. స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ 2 HD మరియు స్టార్ తెలుగు ఛానెల్స్ ఈ మ్యాచ్ లను ప్రసారం చేస్తాయి. Fancode యాప్ OTT ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందనీ వివరించింది. గత ఏడాది మాదిరిగా తెలుగులోనే కాకుండా స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీషులో కూడా ప్రసారాలు అందుబాటులో ఉంటాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..