CM Jagan: ఏపీలోని మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నేరుగా 15 వేలు

|

Apr 10, 2023 | 10:13 AM

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం చేస్తుంది ఏపీ సర్కార్. మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళల కోసం ఈ పథకం తీసుకవచ్చింది.

CM Jagan: ఏపీలోని మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నేరుగా 15 వేలు
Andhra Pradesh CM YS Jagan
Follow us on

ఆంధ్రాలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నగదును ఈ నెల 12న లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు తెలిపింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమం జరగనుంది. బటన్ నొక్కి నేరుగా అర్హుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్. కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రహ్మణ, వెలమ వంటి అగ్రవర్ణాలకు చెందిన పేదల కోసం జగన్ సర్కార్ ఈ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ వర్గాలకు చెంది ఉండి.. 45 ఏళ్ల నుంచి 60ఏళ్లు మధ్య వయస్సు పేద మహిళల ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనున్నారు. ఇలా ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.

ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. గ్రామాల్లో అయితే ఆదాయం నెలకు 10 వేలకు మించికూడదు. అదే పట్టణాలు అయితే ఈ పరిమితి 12 వేలుగా ఉంది. మాగాణి 3 ఎకరాల కన్నా తక్కువ.. మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి ఉంటే.. 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ మన్సిపాలిటీలో స్థలం ఉంటే… అది  750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే ఫ్యామిలీలో ఎవరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవాళ్లు, పింఛన్ తీసుకుంటున్నవాళ్లు ఉండకూడదు. ఈ రూల్ విషయంలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది. అలానే ఫ్యామిలీలో ఎవరికీ ఫోర్ వీలర్ ఉండొద్దు. అలానే ట్యాక్స్ కట్టేవారు కూడా ఉండకూడదు. అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా ఉండాలి. వయసు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఆర్థిక సాయం చేస్తుంది జగన్ ప్రభుత్వం. అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా సాయం అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ళ వయస్సు గల పేద మహిళలందరికీ లబ్ధి చేకూర్చే క్రమంలో..  మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళల కోసం వైఎస్సార్ ఈజీసీ నేస్తం స్కీమ్ ప్రవేశపెట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..