Srisailam: సపోర్ట్ వాల్ నిర్మాణానికి తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యంలో జనం

|

Jul 05, 2024 | 1:01 PM

నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో అరుదైన ఘటన వెలుగుచూసింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా పురాతన శివలింగం దర్శనమిచ్చింది. వివరాలు తెలుసుకుందాం పదండి...

Srisailam: సపోర్ట్ వాల్ నిర్మాణానికి తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యంలో జనం
Ancient Shivaling
Follow us on

శ్రీశైలంలో ఆశ్యర్యకర ఘటనవ వెలుగుచూసింది. భ్రమరాంబా సమేతుడై మల్లికార్జున స్వామి వెలసిన.. ఆ ప్రాంతంలో మరో శివ లింగం బయటపడటంతో భక్తులు ఒక్కసారిగా తన్మయానికి గురయ్యారు. యాఫి ధియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణం కోసం… జేసీబీతో పనులు చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉండటం భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. శివలింగం పక్కనే రాయిపై  కొన్ని గుర్తులతో.. తెలియని లిపితో ఏదో రాసి ఉంది. శివలింగం బయటపడిన వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. మహిళలు పూజలు చేస్తున్నారు. సమాచారం అందడంతో… శ్రీశైల దేవస్థాన అధికారులు, పురోహితులు అక్కడికి వచ్చి శివలింగాన్ని పరిశీలించారు. పురావస్తు శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకుని లిపిని ఆర్కియాలజీ ల్యాబ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..