Ananatapuram: కరోనా వైరస్ రెండేళ్లు అయినా ఇప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చిన కొత్తలో అయితే.. అందరూ పేరు వింటే చాలు చిగురుటాకులా వణికిపోయారు. ప్రపంచంలోని అనేక దేశాలతో సహా మన దేశం కూడా లాక్ డౌన్ విధించింది. ప్రజలు ఇంట్లో నుంచి రావడానికే భయపడిన సమయంలో కూడా కరోనా వారియర్స్ వైద్య సిబ్బంది , శానిటేషన్ కార్మికులు, పోలీసులు మాత్రం తమ విధులను నిర్వహిస్తూనే వారు. అటువంటి కోవిడ్19 పోరాట యోధులకు అన్నం పెట్టిన చేతులు నేడు దీనంగా నా బిల్లులు చెల్లించండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నాయి. తనకు ప్రభుత్వం బకాయి ఉన్న సుమారు రూ. 8 లక్షలు చెల్లించి తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన కొత్తలో ఈ వైరస్ పై అంతగా అవగాహన లేకపోవడంతో చాలా భయానికి గురైన పరిస్థితులున్నాయి. అప్పుడు కరోనా పాజిట్ బాధితులను గుర్తించడం.. వారినుంచి ఎవరికీ సంక్రమించింది గుర్తించి వారిని క్వారంటైన్ కి తరలించడం వారికి చికిత్సనందించడం కోసం రోజుల తరబడి.. ఇంటికి దూరమైనా వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే హిందూపురంలో అలా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా భోజన సదుపాయాలను అందించడానికి కరోనా భయంతో ఎవరూ ముందుకురాని సమయంలో.. సత్యనారాయణ అనే కేటరింగ్ యజమాని తనకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే.. వైద్య సిబ్బందికి భోజనం సరఫరా చేస్తానంటూ ముందుకొచ్చారు.
దీంతో అప్పటి రెవెన్యూ అధికారులు సత్యనారాయణ ముందు వైద్య సిబ్బందికి భోజం సరఫరా చేస్తే.. తాము అనంతరం బిల్లులు చెల్లిస్తామని హామీనిచ్చింది. దీంతో సత్యనారాయణ తన కేటరింగ్ సర్వీస్ ద్వారా హిందూపురంలోని కరోనా చికిత్సనందించిన వైద్య సిబ్బందికి పోకాహారాన్ని అందించారు. రోజ్జు టిఫిన్, భోజనం, రాత్రి డిన్నర్ లో రకరకాల వంటలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మొదట్లో సత్యనారాయణకు అధికారులు రూ. 1,40,000 లను చెల్లించారు. కాలక్రమంలో సత్యనారాయణ అవసరం లేకపోయింది. దీంతో సత్యనారాయణకు చెల్లించాల్సిన బిల్లులపై అధికారులు సీతకన్నేశారు. దీంతో తాను ఆహారం సరఫరా చేయడం కోసం చేసిన అప్పులు తీర్చడానికి తన ఇల్లు, భార్యకు ఉన్న కొద్దిపాటి బంగారం అమ్మేసి.. తీర్చేశాడు.
అనంతరం అధికారుల వద్దకు తన బిల్లులను చెల్లించడమంటూ చక్కర్లు కొట్టడం ప్రారంభించాడు. అయితే అధికారులు సత్యనారాయణపై కరుణాకలకగలేదు.. ఈ క్రమంలో ఓ సారి యాక్సిడెంట్ అయి కుడికాలు విరిగిపోయింది. ఇప్పుడు నడవలేని స్టేజ్ కు చేరుకున్నారు. కరోనా కష్టకాలంలో వెలది మంది ఆకలి తీర్చిన సత్యనారాయ కుటుంబం ఇప్పుడు తినడానికి తిండి లేని స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి అతని బిల్లులు చెల్లించాలని స్థానికులు కూడా కోరుతున్నారు.
Also Read: