AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anandayya Responds to Rumors : మందు తయారీ వదంతులపై స్పందించిన ఆనందయ్య.. తనపై కావాలనే అబాండాలు వేస్తున్నారని ఆవేదన..

Anandayya Responds to Rumors : ఆనంద‌య్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో

Anandayya Responds to Rumors :  మందు తయారీ వదంతులపై స్పందించిన ఆనందయ్య.. తనపై కావాలనే  అబాండాలు వేస్తున్నారని ఆవేదన..
Anandaiah
uppula Raju
| Edited By: Phani CH|

Updated on: May 29, 2021 | 10:16 AM

Share

Anandayya Responds to Rumors : ఆనంద‌య్య నాటు మందు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. కాగా మందుపై పూర్తి స్థాయి ప‌రిశోధ‌న‌లు చేసే వ‌రకు పంపిణీని ఏపీ స‌ర్కార్ నిలిపివేసింది. ఇదిలా ఉంటే ఆనందయ్యతో కొంతమంది ప్రైవేట్‌గా మందు తయారీ చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను ఖండించిన ఆనందయ్య అసలు విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

“రాజకీయాలకు అతీతంగా నేను మందు తయారుచేశా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మందు పంపిణీ చేశా. నేను పోలీసుల సమక్షంలో ఎలాంటి మందు తయారు చేయలేదు. నాపై కొందరు అబాండాలు వేస్తున్నారు. నేను ప్రస్తుతం ఎక్కడా మందు తయారు చేయడంలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మందు తయారు చేసి.. ప్రజలందరికీ అందించేందుకు సిద్ధంగా ఉన్నా” అంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మందు కోసం డిమాండ్ పెరుగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య మందును పూర్తిగా నిర్ధారించిన‌ తరువాత మాత్రమే.. తయారీకి ప‌ర్మిష‌న్ వ‌స్తుంది. నియమ, నిబంధనలతో పాటు వాస్తవ పరిస్థితుల ప్రతిపాదికన గ‌వ‌ర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఆనందయ్య మందుపై విభిన్న కోణాల్లో వార్తలు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఎందులో వాస్తవిక‌త దాగి ఉందో, ఎందులో లేదో తెలియ‌ని పరిస్థితి నెలకొంది. ఆనందయ్య మందు.. నాటు మందు అని, ఆయుర్వేదం కాద‌ని.. ఆయుష్ కమిషనర్ రాములు మౌఖికంగా ధ్రువీకరించారు. అదే క్రమంలో ఆరోగ్యానికి హానీ లేదని చెప్తున్నారు.

Polavaram Project: ఢిల్లీకి వెళ్లి ఆ నిధులు వచ్చేలా చూడండి.. అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..

Corona Spread: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య వ్యత్యాసాలు.. ఐసీఎంఆర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..

Green India Challeng: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..