Ambati Rayudu: రాజకీయాల్లోకి రాయుడు ఎంట్రీ..? అందుకోసమే ఐపీఎల్‌కి గుడ్‌బై చెప్పాడా..!?

|

May 29, 2023 | 9:14 AM

Ambati Rayudu: మరో ఆటగాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కొన్నెళ్ల కిత్రమే అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవు పలికిన అంబటి రాయుడు తాజాగా ఐపీఎల్‌కి కూడా స్వస్తి చెప్పాడు. దీంతో రాయుడు తన  రెండో ఇన్నింగ్స్‌లో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తేలిపోయింది...

Ambati Rayudu: రాజకీయాల్లోకి రాయుడు ఎంట్రీ..? అందుకోసమే ఐపీఎల్‌కి గుడ్‌బై చెప్పాడా..!?
Ambati Rayudu
Follow us on

Ambati Rayudu: టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ తర్వాత ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ నుంచి తప్పుకోంటున్నట్టు రాయుడు ట్విటర్‌లో ప్రకటించారు. ఈ క్రమంలో రాయుడు తన సెకండ్‌ ఇన్నింగ్‌లో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచరం. ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌కు టచ్‌లోకి వెళ్లాడు. ఇంకా కొన్ని రోజుల క్రితమే స్వయంగా తాడేపల్లిలోని సీఎం క్వాంప్‌ ఆఫీస్‌కి వెళ్లి మరీ వైయస్ జగన్‌తో భేటీ అయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అయితే ఖాయమని, అతని నుంచే వైసీపీలో చేరిక విషయంపై క్లారిటీ వస్తుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇక అంబటి రాయుడు క్రికెట్ కెరీర్ గురించి చూస్తే.. 2010లో ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌.. అనంతరం 2018 సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో కొనసాగుతున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో రాయుడు మొత్తం 202 మ్యాచ్‌లు ఆడి.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్‌లో ఒక ఐపీఎల్ సెంచరీ ఉంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు 2013, 2015, 2017 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. ముంబై, సీఎస్‌కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు రాయుడు కెరీర్‌లో ఉన్నాయి. ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాయుడు. మళ్లీ యూ టర్న్‌ తీసుకోనే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..