Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌ అక్కడ మళ్లీ పోటీ చేస్తారా? సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీ అయిన..

Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌ అక్కడ మళ్లీ పోటీ చేస్తారా? సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి
Ambati Rambabu

Updated on: Nov 28, 2022 | 5:27 PM

ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీ అయిన వైసీపీపై విమర్శలు చేయడం మరింత దుమారం రేపుతోంది. అటు పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు గుప్పిస్తుంటే.. ఇటు వైఎస్సార్‌ సీపీ ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం ఏపీ రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి.
ప్రతి రోజు జనసేన, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక జనసేన పార్టీ నేతలు కూడా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం ఏపీ రాజకీయాల్లో మరింత రచ్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. భీమవరంలో మళ్లీ పోటీ చేస్తారా లేదా, మళ్లీ గాజువాకలో పోటీ చేస్తారా, 25 సీట్ల కన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తారా? లేక ఎవరితో కలిసి పోటీ చేస్తారో చెప్పు అంటూ అంబాటి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల్లో పెద్ద జోకర్‌ పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన రౌడీసేనే ఇలా వంద సార్లు అంటాం .. పవన్‌ కల్యాణ్‌తో ఎవరైనా కలిసి వెళితే.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడమే అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు అంబటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి