వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎంపీఈవోల చేత దీక్ష విరమణ చేయిస్తున్న సమయంలో వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోయారు ఉమ్మారెడ్డి. మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిన తరువాత ఆయనను స్థానిక నేతలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అయితే గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఈవోలతో మాట్లాడేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. వారితో మాట్లాడి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. కాగా వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఉమ్మారెడ్డి.. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించారు.