జగన్ ప్రమాణస్వీకారానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?

ఏపీ సీఎం జగన్ పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా ప్రథమంగా తానే అందరికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. తిరిగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్..హంగు, ఆర్భాటాలకు పోకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. ఏపీ సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. అక్షరాలా 29 లక్షల పదివేల రూపాయల ఖర్చుతో  ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ […]

జగన్ ప్రమాణస్వీకారానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2019 | 3:58 PM

ఏపీ సీఎం జగన్ పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా ప్రథమంగా తానే అందరికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. తిరిగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్..హంగు, ఆర్భాటాలకు పోకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు.

ఏపీ సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. అక్షరాలా 29 లక్షల పదివేల రూపాయల ఖర్చుతో  ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ స్ధలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. 2014లో టీడీపీ విజయం తర్వాత అప్పటి సీఎంగా ప్రమాణస్వీకారానికి చంద్రబాబు కోటిన్నర రూపాయలు ఖర్చుచేశారు. వాస్తవానికి ప్రభుత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం ఆర్ధికశాఖలో కీలక అధికారుల నియామకంపై దృష్టిసారిస్తోంది. ఆ లోపు నిర్వహించే ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని, చివరికి ప్రెస్ మీట్లను సైతం తక్కువ ఖర్చుతోనే నిర్వహించేలా ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశాలు ఇస్తోంది.