AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. ఆర్‌.కృష్ణయ్యకు ఛాన్స్‌..

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నలుగురి పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధిష్ఠానం విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది.

Andhra Pradesh: వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. ఆర్‌.కృష్ణయ్యకు ఛాన్స్‌..
Jagan
Srinivas Chekkilla
|

Updated on: May 17, 2022 | 5:12 PM

Share

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నలుగురి పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధిష్ఠానం విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది. న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, బీద మస్తాన్‌ రావు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యకు కూడా అవకాశం కల్పించారు.  తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు వీరు వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఆర్‌.కృష్ణయ్యకు అనుహ్యంగా అవకాశం వచ్చింది. అంతకు ముందు ఆర్. కృష్ణయ్య తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్. కృష్ణయ్య.. గతంలో ఎల్బీనగర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేనప్పటికీ.. బీసీ సంఘాల అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఏపీలో పదవుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక సమీకరణకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణయ్యకు అవకాశ కల్పించినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…