Corona effect: కరోనా కాటుకు మరో పూజారి బలి.. ఆరోగ్యం విషమించి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు మృతి

|

Apr 25, 2021 | 6:29 AM

కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా అందర్నీ చిదిమేస్తుంది. విశ్వ వ్యాప్తమవుతున్న వైరస్ ప్రాణాలను సైతం హరిస్తోంది. తాజాగా ఏపీ రాజధాని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది.

Corona effect: కరోనా కాటుకు మరో పూజారి బలి.. ఆరోగ్యం విషమించి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు మృతి
Suicide
Follow us on

Durga Temple Priest Dies: కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా అందర్నీ చిదిమేస్తుంది. విశ్వ వ్యాప్తమవుతున్న వైరస్ ప్రాణాలను సైతం హరిస్తోంది. తాజాగా ఏపీ రాజధాని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు రాచకొండ శివప్రసాద్‌ కరోనా కాటుకు బలయ్యారు. వారం క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది శుక్రవారమే డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. అంతలోనే శివప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో శనివారం ఇంటి వద్దే మృతి చెందారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇప్పటివరకు 40 మందికిపైగా ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.

Read Also…  Vaccination 3rd phase: కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గాదర్శాకాలు జారీ.. రాష్ట్రాలు కోవిన్ యాప్ లో టీకాల పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచన!