కాపు రిజర్వేషన్లపై అట్టుడికిన అసెంబ్లీ

కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్‌ చర్చను డైవర్ట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారని జగన్ అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ మోసం చేసిందని.. గోదావరి జిల్లాల్లో టీడీపీకి వచ్చిన సీట్లే ఇందుకు నిదర్శనమని జగన్ అన్నారు. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా.? లేదా..? ఈ విషయాన్ని […]

కాపు రిజర్వేషన్లపై అట్టుడికిన అసెంబ్లీ
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2019 | 4:06 PM

కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. బడ్జెట్‌ చర్చను డైవర్ట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారని జగన్ అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ మోసం చేసిందని.. గోదావరి జిల్లాల్లో టీడీపీకి వచ్చిన సీట్లే ఇందుకు నిదర్శనమని జగన్ అన్నారు. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా.? లేదా..? ఈ విషయాన్ని సీఎం జగన్ స్పష్టం చేయాలంటూ ప్రశ్నించారు. 2004, 2009లో రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ మోసం చేశారని.. తాను చేసింది మోసం అయితే.. వైఎస్ చేసింది దగా అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. దానికి వెంటనే స్పందించిన జగన్.. 15ఏళ్ల క్రితం విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటూ సమాధానమిచ్చారు.

మరోవైపు కాపు రిజర్వేషన్లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ నిర్ణీత వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పించలేకపోయారని.. ఈ విషయంలో కాపులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు.