ప్రజలు సంతృప్తిగా వెళ్లాలి : స్పందన కార్యక్రమంలో సీఎం జగన్

రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జాడలు కనిపించకూడదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దం కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. “స్పందన” కార్యక్రమంపై ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని, తాను ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నానని, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్‌ష్టేషన్లలో ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా అంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. నా స్ధాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. జిల్లా కలెక్టర్లు కూడా […]

ప్రజలు సంతృప్తిగా వెళ్లాలి : స్పందన కార్యక్రమంలో సీఎం జగన్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 17, 2019 | 12:55 PM

రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జాడలు కనిపించకూడదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దం కోసమే ప్రయత్నిస్తున్నామన్నారు. “స్పందన” కార్యక్రమంపై ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి అన్నది కనిపించకూడదని, తాను ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నానని, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్‌ష్టేషన్లలో ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా అంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం. నా స్ధాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. జిల్లా కలెక్టర్లు కూడా వారి స్ధాయిలో ప్రయత్నించాలని వారికి దిశానిర్దేశం చేశారు.

లంచం అనే మాట తమ ప్రభుత్వంలో వినిపించకూడదని, ప్రభుత్వ కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా తిరిగి వెళ్లామనే సంతృప్తి ప్రజల్లో కలగాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని ఇకపై చీఫ్ సెక్రెటరీ కూడా సమీక్షిస్తారని, జూలై 1 తేదీ నుంచి 12 వరకు జిల్లాల వారీగా వచ్చిన వినతి పత్రాలు ,వాటి పరిష్కారాలపై .. సమీక్షలో పాల్గొన్న కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు.