కొలువుల జాతర.. 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ..

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు […]

కొలువుల జాతర.. 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 27, 2019 | 8:29 AM

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 1,28,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించనున్నారు. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ -4), గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), ఏఎన్‌ఎం (గ్రేడ్‌-3), పశుసంవర్ధక, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, పట్టుపరిశ్రమ సహాయకుల పోస్టులను స్థానిక అవసరాలకు అనుగుణంగా భర్తీ చేస్తారు. మహిళా పోలీసు, ఇంజినీరింగ్‌ సహాయకుడు, డిజిటల్‌ సహాయకుడు, గ్రామ సర్వేయరు, సంక్షేమ విద్యా సహాయకుడు పోస్టులన్నీ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు తగినట్లు పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నారు. ఇక జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ నియామకాలు జరుగనున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగష్టు 8తో ముగియనుంది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు అక్టోబర్ 2న విధుల్లోకి చేరతారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu