ఆమంచి వర్సెస్ కరణం: చీరాలలో ఉద్రిక్తత

| Edited By: Srinu

Nov 27, 2019 | 1:39 PM

ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నవశకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను అడ్డుకున్న ఆమంచి వర్గీయులు.. కరణంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి పోటీగా […]

ఆమంచి వర్సెస్ కరణం: చీరాలలో ఉద్రిక్తత
Follow us on

ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ నవశకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను అడ్డుకున్న ఆమంచి వర్గీయులు.. కరణంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి పోటీగా టీడీపీ వర్గీయులు కూడా నినాదాలు చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని.. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కరణంపై గతంలో రెండుసార్లు వరుసగా గెలిచిన ఆమంచి.. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈ ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.