ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. టీడీపీ ఏకగ్రీవ తీర్మానం

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 1:45 PM

మహానేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, గొప్ప నటుడైన దివంగత శ్రీ ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ మహానాడు వేదికగా టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ నందమూరి తారక రామారావు 97 జయంతి సందర్భంగా...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. టీడీపీ ఏకగ్రీవ తీర్మానం
Follow us on

మహానేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, గొప్ప నటుడైన దివంగత శ్రీ ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ మహానాడు వేదికగా టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ నందమూరి తారక రామారావు 97 జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు పలు కీలక వాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం తెలుగు దేశం పార్టీ కృషి చేస్తోందని అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ అని కొనియాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్ జీవితం ఆదర్శనీయమన్నారు. సేవకు నిలువెత్తు రూపంగా ఆయన నిలిచారని కీర్తించారు. రెండో రోజు మహానాడు వేదికగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. పార్టీకి సవాళ్లు కొత్త కాదని అన్నారు. టీడీపీని ఎవరూ కదిలించలేరని, ఎన్ని సమస్యలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. అలాగే ఎప్పుడూ పార్టీకి వెన్నంటే పార్టీకి అండగా నిలబడుతున్న కార్యకర్తలను ప్రశంసించారు చంద్రబాబు.

Read More:

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తప్పక సాధిస్తాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

ఏపీ వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..