రాజీనామా చేశా.. రేపటి నుంచి అందరినీ కడిగిపారేస్తా

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వైరల్ అయిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశా. నా కృషికి జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. నన్ను ఏ విధంగా దెబ్బకొట్టాలని చూశారు. రైతులు అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని అనలేదు. కార్పోరేట్ రైతుల […]

రాజీనామా చేశా.. రేపటి నుంచి అందరినీ కడిగిపారేస్తా
Follow us

| Edited By:

Updated on: Jan 12, 2020 | 7:53 PM

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వైరల్ అయిన నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశా. నా కృషికి జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. నన్ను ఏ విధంగా దెబ్బకొట్టాలని చూశారు. రైతులు అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని అనలేదు. కార్పోరేట్ రైతుల గురించే నేను మాట్లాడా. అమరావతిలో ఉన్న బినామా రైతులనే పెయిడ్ ఆర్టిసులని మాట్లాడా. నా కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. ఫేక్ వాయిస్ పెట్టి నన్ను అప్రతిష్టపాలు చేశారు. నాపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా బాధపడుతున్నా. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని మందు తాగానని మాట్లాడారు. ఎటువంటి వైద్య పరీక్షలకైనా నేను సిద్ధం. నేను మద్యం తాగినట్లు నిరూపించాలి. నేను ఒక్క రూపాయి తిని ఉంటే నాశనమై పోతాను. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఖండించా. పోసాని నా గురించి ఎందుకలా మాట్లాడారో తెలియదు. నేను జగన్‌కు, సుబ్బారెడ్డికి దగ్గరవుతున్నాననే టార్గెట్ చేశారు. నిజమైన రైతులకు నేను క్షమాపణలు చెబుతున్నా. పోసాని, నేను మంచి స్నేహితులం. పోసానికి, నాకు మధ్య అనవసరంగా గొడవలు పెట్టారు. నా మీద వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి. విచారణ తరువాతే మళ్లీ ఆ సీట్లో కూర్చుంటా. నా రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పంపించా. నేను ఇక ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి అందరినీ కడిగిపారేస్తా. ఆడియో టేప్‌లోని వాయిస్ నాది కాదు. అన్ని శక్తులు ఒక్కటై నన్ను ఇరికించారు. మద్యం తాగినట్లు నిరూపిస్తే నన్ను చెప్పుతో కొట్టండి.’’ అని అన్నారు.

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..