స్వతంత్ర అభ్యర్థులు లేని తొలి శాసనసభ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక్క స్వతంత్ర శాసనసభ్యుడు కూడా లేని శాసనసభ తొలిసారి కొలువుదీరనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014 వరకు ప్రతి సభలోనూ స్వతంత్ర అభ్యర్థులున్నారు. 2014లో పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ తరపున గెలిచారు. ఈసారి వైసీపీ 151చోట్ల, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. దీంతో ఒక్క స్వతంత్రుడూ లేని తొలిసభగా రికార్డు నమోదు కానుంది. 1957 తొలి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక్క స్వతంత్ర శాసనసభ్యుడు కూడా లేని శాసనసభ తొలిసారి కొలువుదీరనుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014 వరకు ప్రతి సభలోనూ స్వతంత్ర అభ్యర్థులున్నారు. 2014లో పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ తరపున గెలిచారు. ఈసారి వైసీపీ 151చోట్ల, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. దీంతో ఒక్క స్వతంత్రుడూ లేని తొలిసభగా రికార్డు నమోదు కానుంది. 1957 తొలి ఎన్నికల్లో 12మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ 1983 ఎన్నికల్లో 18 మంది గెలుపొందారు. 1967 ఎన్నికల్లో అత్యధికంగా 68 మంది విజయం సాధించారు.