వైసీపీ శాసనసభాపక్ష భేటీ ప్రారంభం
అమరావతి: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10:31 గంటలకు ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు. శాసనసభాపక్షం […]
అమరావతి: వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10:31 గంటలకు ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు.
శాసనసభాపక్షం సమావేశమైన వెంటనే ఉదయం 11:30 గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.