అవన్నీ ఉత్తుత్తి ఇంటర్వ్యూలే.. జగన్‌పై లోకేశ్ సెటైర్స్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2019 | 9:58 PM

ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్‌లో యాక్టీవ్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్..సీఎం జగన్‌, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూలకు సంబంధించి సీఎంపై సెటైర్లు వేశారు. రేషన్ సరుకులు, పెన్షన్‌తో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సుమారు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్టు […]

అవన్నీ ఉత్తుత్తి ఇంటర్వ్యూలే.. జగన్‌పై లోకేశ్ సెటైర్స్
Follow us on

ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్‌లో యాక్టీవ్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేశ్..సీఎం జగన్‌, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూలకు సంబంధించి సీఎంపై సెటైర్లు వేశారు.

రేషన్ సరుకులు, పెన్షన్‌తో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సుమారు 7లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. గ్రామ వాలంటీర్లను స్థానిక ఎమ్మార్వో నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుంది. వీటిపై లోకేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

‘అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూసాం. జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారేంటా అని బాధపడుతున్నాం. జగన్ గారూ! ఇందుకేనా మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని, అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? దీనికి స్వఛ్చంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది.’ అని ట్వీట్ చేశారు.