మినహాయింపు పిటిషన్ కొట్టివేత.. జగన్‌ కోర్టుకు రావాల్సిందే

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు అయ్యింది. ఆయన దాఖలు చేసుకున్న కోర్టు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్‌కు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ, కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన నాంపల్లి సీబీఐ కోర్టు.. ఆస్తుల కేసు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేవారు. ఇక సీఎంగా బాధ్యతలు […]

మినహాయింపు పిటిషన్ కొట్టివేత.. జగన్‌ కోర్టుకు రావాల్సిందే

Edited By:

Updated on: Nov 01, 2019 | 11:42 AM

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు అయ్యింది. ఆయన దాఖలు చేసుకున్న కోర్టు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్‌కు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ, కోర్టుకు తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన నాంపల్లి సీబీఐ కోర్టు.. ఆస్తుల కేసు విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

అయితే అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేవారు. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కోర్టుకు హాజరయ్యే విషయంపై తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇప్పుడు తాను రాష్ట్రానికి సీఎంగా ఉన్నందున ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరు కావాలంటే అనవసరపు ఖర్చులు అవుతుందని ఆయన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా అటు జగన్ తరఫున, ఇటు సీబీఐ తరఫున గట్టిగానే వాదనలు వినిపించారు. ఇక ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది.