ఏపీ అసెంబ్లీలో కరువుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ ఇచ్చారో, లేదో చెప్పాలని..ఇవ్వలేదు అని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ సవాల్‌ను స్వీకరించాలని వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేయడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బాబు..ఇంటిముందుకు పాదయాత్ర డిమాండ్లు నెరవేర్చమని ప్రజలు వస్తుంటే 144 సెక్షన్ పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి అనిల్‌కుమార్.. సీఎం జగన్ సవాల్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మేం అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామన్నది కాదు..విసిరిన సవాల్‌కు.. బుల్లెట్ దిగిందా లేదా? అంటూ వ్యాఖ్యానించారు.