దేశం ఏపీ వైపు నిలబడి చూసేలా పరిపాలన సాగిస్తా

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మంచి పరిపాలన అందచేస్తానని ఏపీ నూతన సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఈ విజయం తనపై మరింత బాధ్యత పెంచిందన్న జగన్… మంచి పాలనతో అందరి అంచనాలు అందుకునేందుకు క‌ృషి చేస్తానని తెల్పారు. ఇటీవలే ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ […]

దేశం ఏపీ వైపు నిలబడి చూసేలా పరిపాలన సాగిస్తా
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2019 | 3:57 PM

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మంచి పరిపాలన అందచేస్తానని ఏపీ నూతన సీఎం జగన్ వెల్లడించారు. ఎన్నికల్లో అద్బుత విజయాన్ని అందించిన ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఈ విజయం తనపై మరింత బాధ్యత పెంచిందన్న జగన్… మంచి పాలనతో అందరి అంచనాలు అందుకునేందుకు క‌ృషి చేస్తానని తెల్పారు. ఇటీవలే ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 151 అసెంబ్లీ సీట్లు..22 లోక్ సభ సీట్లతో విజయకేతనం సంగతి తెలిసిందే.