ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌లో 42మంది తొలగింపు
హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక అధికారులను మార్చిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి మించి నియమించిన 42 మంది సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మెమో విడుదల చేశారు.