’’ఏంటి నాని నల్లబడ్డావ్..!‘‘

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2019 | 3:21 PM

ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇంత వాడీవేడీ సమావేశాల్లోనూ అప్పుడప్పుడు లాబీల్లో సభ్యుల మధ్య సరదా సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అచ్చెన్నాయుడు,  మంత్రి కొడాలి నాని మధ్య ఆసక్తి సంభాషణ చోటుచేసుకుంది. నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ అచ్చెన్నాయుడు నానిని పలకరించారు. దానికి సమాధానంగా మాట్లాడుతూ.. ‘‘జనంలో తిరుగుతున్నాం కదా!.. మీలా రెస్ట్ లేదు’’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దానితో ఊరుకోని అచ్చెన్నాయుడు […]

’’ఏంటి నాని నల్లబడ్డావ్..!‘‘
Follow us on

ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇంత వాడీవేడీ సమావేశాల్లోనూ అప్పుడప్పుడు లాబీల్లో సభ్యుల మధ్య సరదా సంభాషణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అచ్చెన్నాయుడు,  మంత్రి కొడాలి నాని మధ్య ఆసక్తి సంభాషణ చోటుచేసుకుంది. నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ అచ్చెన్నాయుడు నానిని పలకరించారు. దానికి సమాధానంగా మాట్లాడుతూ.. ‘‘జనంలో తిరుగుతున్నాం కదా!.. మీలా రెస్ట్ లేదు’’ అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దానితో ఊరుకోని అచ్చెన్నాయుడు రేషన్‌‌లో ఇస్తామన్న సన్నబియ్యం సంగతి తేలుస్తానంటూ సవాల్ విసిరారు. దానికి ప్రతిస్పందనగా.. నువ్వు ఏమీ తేల్చలేవు.. సన్నబియ్యం ఇచ్చి తీరుతానని.. అవసరమైతే నీకు సన్నబియ్యం బస్తా పంపుతానంటూ స్పష్టం చేశారు.