Amaravati: రేపల్లెలో హీట్ పెంచుతున్న అమరావతి రైతుల పాదయాత్ర.. అడ్డుకుంటామంటూ వెలసిన ఫ్లెక్సీలు..
Andhra Pradesh: అమరావతి రైతుల మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. ఐదో రోజు కొల్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఐదు గ్రామాల మీదుగా సాగింది. కొల్లూరు, కోటిపల్లి, వెల్లటూరు, భట్టిప్రోలు, ఐలవరం వరకు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగింది
Andhra Pradesh: అమరావతి రైతుల మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. ఐదో రోజు కొల్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఐదు గ్రామాల మీదుగా సాగింది. కొల్లూరు, కోటిపల్లి, వెల్లటూరు, భట్టిప్రోలు, ఐలవరం వరకు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగింది. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ.. అమరావతి టు అరసవల్లి పేరుతో రైతులు చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ పాదయాత్రలో పాల్గొని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రవణ్‌కుమార్, వెంకట సుబ్బయ్యతోపాటు మాజీ ఎంపీ మాల్యాద్రి, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు.. అమరావతి రైతులతో కలిసి నడిచారు.
కాగా ఇవాళ, ఐలవరం నుంచి రైతుల పాదయాత్ర మొదలుకానుంది. అయితే, అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా రేపల్లె నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి వైసీపీ శ్రేణులు. తమ ప్రాంతంలో పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించడంతో రేపల్లేలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..