ఏపీలో ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే నెల 3, 4 తేదీలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లోనూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను జెడ్పీ కార్యాలయాల్లోనూ పరిశీలను ఉంచాలని పేర్కొంది. అయితే పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇంకా పరిషత్ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది.