స్టూడెంట్స్ అలర్ట్: 1నుంచి 10వ తరగతి పాఠాల షెడ్యూల్‌లో మార్పు..

|

Jul 09, 2020 | 10:40 AM

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే,..

స్టూడెంట్స్ అలర్ట్: 1నుంచి 10వ తరగతి పాఠాల షెడ్యూల్‌లో మార్పు..
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం కావడంతో వారి విలువైన సమయం వృద్దా అయిపోతుంది. దీంతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జూన్ 10వ తేదిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో 1 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో పలు మార్పులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

దూరదర్శన్‌లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠా షెడ్యూల్‌ను ఈ నెల 13 నుంచి 31 వరకు మార్పు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. వారంలో 5 రోజులు, రోజుకు 6 గంటలు పాఠాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. 1,2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, 3,4,5 తరగతులకు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు, 6,7 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, 8,9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పదో తరగతి వారికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారం చేస్తామంది.