చిన్నారి లేఖకు స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..!

తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలేశారంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పుష్ప అనే నాల్గవ తరగతి చిన్నారి.. తన బాధను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి చెప్పుకుంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కాస్త వైరల్‌గా మారి సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ విషయంపై నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసిన ఆయన.. ఘటన గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామానికి వెళ్లి వివరాలు […]

చిన్నారి లేఖకు స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..!

Edited By:

Updated on: Sep 14, 2019 | 9:22 PM

తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలేశారంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పుష్ప అనే నాల్గవ తరగతి చిన్నారి.. తన బాధను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి చెప్పుకుంటూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కాస్త వైరల్‌గా మారి సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ విషయంపై నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసిన ఆయన.. ఘటన గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామానికి వెళ్లి వివరాలు కనుక్కొని.. ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. దీంతో హుటాహుటిన కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లారు.

కాగా తన కుటుంబాన్ని ఊరి నుంచి వెలేశారని.. తమ కుటుంబంతో ఎవరైన మాట్లాడితే రూ.10వేలు ఫైన్ వేస్తారని చెబుతున్నారని.. తమతో ఎవరూ మాట్లాడలేదని, ఆడట్లేదని. తమకు చదువుకోవాలని ఉంది అంటూ పుష్ఫ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తన నాన్నను, తాతను చంపేస్తారని తమ స్నేహితులు చెబుతున్నారని ఆ చిన్నారి లేఖలో రాసింది.

కాగా ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురంకు చెందిన కోడూరి వెంకటేశ్వర్లు(పుష్ప తండ్రి)కి స్థానికులతో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే ఆ కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఊరి నుంచి వెలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వెంకటేశ్వర్లు గతంలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారట. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన కుమార్తె పుష్ప సీఎం జగన్‌కు లేఖ రాసింది.